పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

మహాపురుషుల జీవితములు

కేశవచంద్రసేనుని కంటెను, మేథావంతుఁడనియు మేథావంతుఁడే గాక విద్యావంతుఁడనియు వానిమరణము దేశమున కంతకు నష్టముఁ గలిగించెననియు నివారించెను. పదిభాషలలో నిరర్గళ పాండిత్యము గలిగి సంస్కృతమునం దింతింత యనరాని ప్రజ్ఞ గలిగి యింగ్లీషులో నాంగ్లేయులకు సయితము నీర్ష్యఁ బొడమింపఁగల సామర్థ్యము గలిగి ప్రపంచము నందుండిన సమస్తవిద్యా సంఘములలోను సభ్యుఁడుగా నున్న హిందువుఁడు పందొమ్మిదవ శతాబ్దమునఁ రాజేంద్రలాలుఁ డొక్కఁడేయని తెలిసికొనవలయును.