పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

మహాపురుషుల జీవితములు

లను మునుముందు నేర్చి యనంతరము ఫ్రెంచి జర్మనుభాషలనుజదివి పిమ్మట హిందీ ఉరుదు భాషల నభ్యసించి మొత్తముమీద పదిభాషలను జదువ వ్రాయ మాటలాడఁగల పండితుడయ్యెను. ఎన్ని భాషలు తనకువచ్చినను తనభాషలు తనకన్నము పెట్టజాలవని యెఱుగి రాజేంద్రుడేదైన యుద్యోగములో బ్రవేశింపవలయునని నిశ్చయించుకొని 1846 వ సంవత్సరమున బెంగాలు ఏషియాటిక్కు సొసైటి యను సంఘమునకు సహాయకార్యదర్శియు గ్రంథభాండార సంరక్షకుఁడు నయ్యెను. అప్పటికతని వయస్సిరువదిమూడు సంవత్సరములు. ఈయుద్యోగమువలన నుపయోగములగు ననేకగ్రంథములువాని స్వాధీనములో నుండుటచే నతడు వాని వన్నిటిని సారముగ్రహించి జ్ఞానాభివృద్ధి చేసుకొనఁజొచ్చెను. ఆసంఘముయొక్క కార్యదర్శుల సహాయమున నతఁ డింగ్లీషుభాషలో మంచిశైలిని వ్రాయుటకలవరుచుకొని కొలది కాలములోనే పైసహాయము లేక స్వయముగ మంచి వ్రాతలు వ్రాయనేర్చెను. ఆసంఘమువారి గ్రంథము లన్నియుఁ సరిగా జాబితా వ్రాసి యమర్చి తనకు తీరికయున్నప్పుడు సంఘమువారి మాసపత్రిక కేవైన వృత్తాంతములు వ్రాయుచువచ్చెను. అట్లుకొన్ని నాళ్ళు వ్రాసి 1850 వ సంవత్సరమున రాజేంద్రుఁడు భాషాగ్రంథములను ప్రకృతి శాస్త్రములను వ్రాసి ప్రకటించుటకై వివిదార్థ సంగ్రహమను పేరు గల యొకమాసపత్రికను బంగాళీభాషలో స్వయముగ బొమ్మలతోఁ బ్రకటింప నారంభించెను. అట్లతఁడు పత్రిక నేడు సంవత్సరములు ప్రకటించి మరుచటి సంవత్సరమున మైనరుజమీందార్లకు విద్యచెప్పు పాఠశాలకు నధ్యక్షుఁడుగ నియమింపఁబడెను. ఇందుమూలమున నతఁడు పాఠశాలలోఁజేరిన జమీందార్లబిడ్డలకు సంరక్షకుఁడయ్యెను. ఈజమీందారీ పాఠశాల యేకారణముచేతనో దొరతనమువా రనుకొనినంత వృద్దిని పొందకపోవుటచే 1880 వ సంవత్సరమున నదియెత్తి