పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిశ్చంద్రముకర్జీ

99

యాపత్రికకు వృత్తాంతములు వ్రాయుచు దానిపైమిక్కిలి యభిమానము గలవాఁడయ్యెను. కొంతకాలముగడచునప్పటికి పత్రికాస్థాపకులగు నన్నదమ్ములకుఁ బత్రికపై నభిమానముతగ్గుటయు ముకర్జీకి హెచ్చుటయు సంభవింపగా నెట్ట కేలకు ముకర్జీయొక్కడే దానింబ్రకటించుభారమునుఁ బూనెను. అదివఱకా పత్రికముద్రింపబడుముద్రా యంత్రము మఱియొకరికి విక్రయింపఁబడుటచే నతఁడు పత్రికనిమిత్తము మఱియొక యచ్చుకూటమునుఁ గొని తనయన్నగారినే పత్రికకు ముద్రాశాలకు గార్య నిర్వాహకుఁడుగా నేర్పరచి యసాధారణ ప్రజ్ఞతో దానిని నడపఁజొచ్చెను.

1856 వ సంవత్సర ప్రాతమున స్త్రీపునర్వివాహ విషయములతో బంగాళాదేశమంతయు నట్టుడికినట్లుడుక జొచ్చెను. హరిశ్చంద్రముకర్జీ ఈశ్వరచంద్ర విద్యాసాగరుని పక్షముబూని సంఘ సంస్కారము మంచిదేయని పత్రికమూలమున వాదించి సంస్కర్తలకుఁదగిన సాయము చేసెను. అప్పటి గవర్నరుజనరలుగారగు డల్‌హవుసీప్రభువుగారు హిందూదేశమునందలి పెక్కుభాగములను గలుపుకొని కంపెనీవారి యేలుబడిక్రిందకుఁ దీసికొనివచ్చెను.

తరతరములనుండి యేలుచున్న రాజులను రాజ్యభ్రష్టులుగాఁ జేయుట యన్యాయమని హరిశ్చంద్రముకర్జీ పలుమారు నిర్భయముగ వాదించెను. డల్‌హవుసీ ప్రభువుగారి తరువాత గవర్నరుజనరలుగా వచ్చిన కానింగుప్రభువుగారి కాలమున సిపాయిపితూరీరాఁగాముకర్జీ చాల పాటుపడి సిపాయీలకు దొరతనమువారికి మనస్పర్థలుదొలఁగించి సంధిచేసెను. ఆంగ్లేయపత్రికాధిపతులగు దొరలు కొందఱు సిపాయిపితూరి సంబంధముగల స్వదేశస్థుల భూములు మొఖాసాలు నగ్రహారములు దీసికొని గవర్నమెంటువారు దొరలకిచ్చుటబాగుండుననివ్రాసిరి. అట్లుచేయుట ధర్మవిరుద్ధమనియు ప్రజలకోపమునణచుటకు