పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[13]

హరిశ్చంద్ర ముకర్జి

ఇతని ప్రతిమ మాకు దొరికినదిగాదు. ఈయన బంగాళాదేశపు కులీన బ్రాహ్మణుఁడు. తండ్రియగు రామధనముకర్జీ మిక్కిలి బీదవాఁడు. వీరిద్ద రన్న దమ్ములు. ఈయన యన్నగారిపేరు హరెన్ చంద్ర ముకర్జీ.

హరిశ్చంద్రముకర్జీ 1824 వ సంవత్సరమున కలకత్తాకుసమీపముననున్న భవానీపురమున బుట్టెను. ఆతఁ డయిదేండ్ల వయసుగల వాఁడయినప్పుడు తన యూరిబడిలో స్వభాష కొంతవఱకుఁ జదువుకొని యేడవయేట నింగ్లీషు నారంభించ బీదవాడగుటచే జీతము లేకుండ నొక పాఠశాలలోఁ జేరి పదునాలుగు వత్సరములు వచ్చు వఱకు నచ్చట విద్య నభ్యసించెను. ఆతని కుటుంబము మిక్కిలి దారిద్ర్యముచే బాధపడుచుండుటచే నతఁడు చదువుమాని యేమైన సంపాదించి సంసారము వహింపవలసినవాఁ డయ్యెను. అందుచే హరిశ్చంద్రముకర్జీ జనుల కర్జీలు వుత్తరములు బాకీజాబితాలు వ్రాసి కుటుంబమును బోషింపఁజొచ్చెను. అట్టి పనులవలన సొమ్ము సరిగా రాకపోవుటచే నతని బీదతనము తగ్గ లేదు సరికదా యొకసారి ఆ పూటకుఁగూడ బియ్యపుగింజలు లేక యింటిలోనున్న రాగిబిందె తాకట్టు వేసికోదలఁచుకొన్నంత దురవస్థ పట్టెను. అంతలో నొక జమీందారుని యేజంటువచ్చి వానిచే నొకయర్జీ వ్రాయించుకొని రెండురూపాయలిచ్చి బింది తాకట్టు అవసరము లేకుండఁ జేసి వాని గౌరవమునుఁ గాపాడెను. కుటుంబ మేవిధముచేతను గడచెడువిధము గనఁబడక పోవుటచే హరిశ్చంద్రముకర్జీ యొకరివద్ద పది రూపాయలు జీతముగల గుమాస్తాగా కుదిరెను. ఆతఁ డాయుద్యోగమునైన పది కాలములపాటుంచుకొనక యజమానునితో వివాదపడి కొద్దికాలము