పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[12]

కృష్ణదాస్‌ పాలు

హిందూదేశమున వార్తాపత్రిక కధిపతియైయుండి మహా ప్రఖ్యాతిగాంచిన పురుషులలో నితఁ డగ్రగణ్యుఁడు. ఇతఁడు 1838 వ సంవత్సరమున జన్మమొందెను. అతనితండ్రియగు నీశ్వరచంద్రపాలుఁడు మిక్కిలి బీదవాఁడు. కృష్ణదాసు మొట్టమొదట నొకపాఠశాలలోఁ బ్రవేశించి యచ్చట బంగాళాభాషను జదివి యాభాషలో నతనికిఁ గల ప్రవీణతకు నొకవెండి పతకమును బహుమానముగఁ బడసెను. అతఁడు పదేండ్ల ప్రాయముగలవాడయినప్పు డింగ్లీషుఁ జదువ నారంభించి 1853 వ సంవత్సరమున నాయింగ్లీషు పాఠశాలను విడిచెను. బడిమానిన వెనుక కృష్ణదాసుపాలుఁడు కొన్నినాళ్ళు క్రైస్తవమతబోధకుఁడై కలకత్తాలోనున్న రివరెండు మిన్నిదొరగారివద్ద విద్యనభ్యసించెను. అనంతర మతఁడు కలకత్తాలో విద్యావిషయములగు చర్చలను స్వేచ్ఛగా జరుపుటకు స్తాపింపఁబడిన యొకసమాజములో జేరి యచ్చట రివరెండుమార్గన్ దొరగారు మొదలగు గొప్పవారు జేయు నుపన్యాసములను విని యందువలనఁ గలిగినలాభములను బొందుచువచ్చెను.

1854 వ సంవత్సరమున నతఁడు మరల జదువదలచి రాజేంద్రుదత్తుగారిచే స్థాపింపబడిన హిందూ మెట్రాపాలిటన్ కాలేజీ యను కళాశాలలోఁజేరి యచ్చట మూఁడు సంవత్సరములవఱకుఁ జదివెను. విద్యార్థిగానున్ననాడు మొదలుకొని యతనికి రాజకీయవ్యవహారముల యందు మిక్కిలియభిమానము. అతఁడు వ్రాసినవ్రాతలు నతడిచ్చిన యుపన్యాసములుచూడ నంతచిన్న వయసువాని కింతశక్తి యెట్లుగలిగెనాయని తోచును. పెద్దలెవరితోనైనఁ దనకభిప్రాయభేదము కలిగినప్పుడు మొగమోటముచేత నూరుకొనక తనయభిప్రాయమునిర్భయ