పుట:KutunbaniyantranaPaddathulu.djvu/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. ఫోమ్స్, ఫోమ్ బిళ్ళలు

ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు రకరకాలుగా ఉంటారు. కొందరు డాక్టరుని విసిగించి ఒకే విషయాన్ని పదిసార్లు అడుగుతూ ఉంటే మరి కొందరు డాక్టరు చెప్పినదంతా వింటూ అంతా అర్ధమయినట్టే బుర్ర ఊపి, చివరికి చెప్పినదానికి భిన్నంగా చేస్తారు. అలాంటి యువతే రత్నకుమారి. గర్భనిరోధానికి ఫోమ్ బిళ్ళలు ఎప్పుడు వాడవలసిందీ, ఎలా వాడవలసిందీ డాక్టరమ్మ చెప్పుతున్నంతసేపూ తల ఊపి ఇంటికి వెళ్ళీ "ఫోం బిళ్ళ"లని వాడవలసిన పద్ధతిలో కాక నోట్లో వేసుకుని మింగేసింది. కడుపులో కలిగిన వికారానికి మరునాడు డాక్టరమ్మ దగ్గరికివెళ్ళి "అబ్బ, ఏమిటి డాక్టరుగారూ బిళ్ళలు అసలే పెద్దవిగా ఉన్నాయి. మింగలేక చచ్చాను, ఏదో కష్టపడి మింగాను కదా అని అనుకుంటే, అంతటితో పోక కడుపులో వికారం ప్రారంభం అయింది" అంటూ చెప్పింది. తాను అంత చెప్పినా రత్నకుమారి చేసిన పనికి నవ్వాలో, ఏడవాలో తెలియలేదు డాక్టరమ్మకి.

గర్భనిరోధక పద్ధతుల్లో ఫోమ్ భిళ్ళలు, నురగలాగా "ఫొమ్ " ద్రవాలు కూడా వున్నాయి. వీర్యకణాలని నాశనంచేసే రసాయనకాలు సంయోగం సమయంలో యోని