పుట:KutunbaniyantranaPaddathulu.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ

ఈనాటి దంపతుల తక్షణ కర్తవ్యం

"మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని" మనకొక సామెత ఉంది. ఒక కుటుంబ విషయంలో ఇది ఎంత నిజమో, ఒక దేశం విషయంలోనూ అంతగానే నిజం. పరిమితికి మించి సంతానం కలిగితే కుటుంబంలో ఎన్ని సమస్యలు తలెత్తుతాయో అంతకంటె రెట్టింపుసమస్యలు దేశం విషయంలో కలుగుతాయి.

"పిండి కొద్దీ రొట్టె" దేశంలో ఆహారోత్పత్తికి తగిన వనరులు లేనపుడు, ఉండటానికి తగున వసతులు లేనపుడు, ఉద్యోగాలకి తగిన ఖాళీలు లేనపుడు, రోగులకి తగినంత మందులు లేనప్పుడు లెక్కకు మించి జనాభా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు సమస్యలు ఎదురవక ఏమవుతాయి ? అందరికీ అన్ని సౌకర్యాలు ఒనగూర్చాలంటే కుదిరేపనా ?

అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, రష్యా, జపాను, ఇంగ్లండు, స్విట్జర్లాండు వంటి దేశాల్లోని ప్రజలు సకలసౌకర్యాలతో సుఖంగా ఉన్నారంటే వారు జనాభా పెరుగుదలని పూర్తిగా అరికట్టడం వల్లనే. ఎన్ని సంవత్సరాలు