పుట:KutunbaniyantranaPaddathulu.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 77

పోతారు. ఒక్కొక్కసారి ఆ భయం తీవ్రతతో వీర్యస్కలనం అయిపోతున్నా వారికి అంగ ఉపసంహరణ చేయలేని మానసిక అశక్తస్థితి ఏర్పడుతుంది. అప్పుడప్పుడు వీర్యస్కలనం జరగకముందే పురుషాంగంనుంచి వెలువడే పల్చని ప్రొస్టేటు ద్రవంలో కొన్ని వీర్యకణాలు వుండి వాటివల్ల కూడా గర్భం రావచ్చు. అందుకని రతిలో పురుషాంగం ఉపసంహరణ పద్ధతివల్ల గర్భం రాదని ధైర్యంగా వుండటానికి వీలు లేదు. గర్భనిరోధక పద్ధతిగా ఇది అవలంభించాలనుకున్నప్పుడు ఫోమ్ బిళ్ళలుకూడా యోని మార్గంలో వుపయోగించినట్లయితే చాలావరకు రక్షణ ఏర్పడుతుంది.

* * *