పుట:KutunbaniyantranaPaddathulu.djvu/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 67

దానంతట కదే జారిపోతుంది. అయితే ఒక సంవత్సరంపాటు జారిపోకుండా నిలిచిన లూప్ రెండవ్, మూడవ సంవత్సరంలో జారిపోవడం అరుదు.

లూప్ జారిపోయింది కదా అని మళ్ళీ లూప్ వేస్తే వారిలో అధిక సంఖ్యాకుల్లో తిరిగి లూప్ జారిపోవడానికి అవకాశం వుంది. లూప్ జారిపోవడం అనేది ముఖ్యంగా పిల్లలు పుట్టిన తల్లుల్లో కంటే అసలు పిల్లలు పుట్టని వారిలో ఎక్కువ.

లూప్ ముఖ్యంగా బహిష్టు సమయంలో బహిష్టు స్రావంతో జారిపోతుంది. కాన్పు అవగానే లూప్ వేయించుకున్న వారిలో మూడవవంతు మందిలో లూప్ జారిపోవడం ఎక్కువ. లూప్ దానంతట కదే జారిపోవడం నూటికి ఇరవై మంది స్త్రీలు గుర్తించగలుగుతారు. అయితే నూటికి 80 మంది లూప్ పడిపోయిందనే గమనించరు. అందుకని లూప్ వేయించుకున్న వారు ప్రతీసారి బహిష్టుస్తావం అయిపోయిన తరువాత యోని మార్గంలో వ్రేలు పోనిచ్చి గర్బాశయకంఠం (సెర్విక్స్ దగ్గర లూప్ దారాలు తగుతున్నదీ లేనిదీ గమనించడం మంచిది. అలా చూసుకోవడం వల్ల లూప్ వున్నదీ పడిపోయినదీ తెలుసుకుని గర్భం రాకుండా జాగ్రత్త పడవచ్చు.