పుట:KutunbaniyantranaPaddathulu.djvu/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 65

ల్యూర్ లూప్ వేయించుకున్న మొదటి సంవత్సరంలో ఎక్కువ, లూప్ వేయించుకున్న సంవత్సరం తరువాత లూప్ పిఫలమై గర్భం రావడం తక్కువ. లూప్ వుండగా గర్భం వచ్చిన వారిలో గర్భం నిలవడం తక్కువ. అందుకనే లూప్ వుండగా గర్భం వచ్చిన వారికి మూడు నుంచి ఆరు నెలల్లో గర్బస్రావం జరిగిపోతూ వుంటుంది.

లూప్ వుండగా గర్భం వచ్చినవాళ్ళు ఆ గర్బాన్ని వుంచుకోవాలని ఆశించినప్పుడు మొదటి 3-4 నెలల్లోనే లూప్‌కి ముడివేయబడి వున్న నైలాన్ దారాలని పట్టుకుని నిదానంగా బయటికి లాగివేయాలి ఇలా లూప్‌ని గర్భకోశం నుంచి లాగివేయడం వల్ల గర్భం నిలిచే అవకాశం ఎక్కువ.

గర్భం వచ్చినప్పుడు నిదానంగా లూప్‌ని బయటకు లాగివేయడం కుదరనపుడు దానిని అలాగే వుంచివేసి గర్భాన్ని కొనసాగనివ్వవచ్చు. లూప్ గర్భాశయంలో వుండగా గర్భాన్ని కొనసాగించడం వల్ల పిండంలో ఎటువంటి అంగవైకల్యం కలగడం గాని, జన్యుదోషం ఏర్పడటం గాని జరగదు. లూప్‌ని అలాగే వుంచేసి గర్బాన్ని కొనసాగించడం వల్ల గర్బస్రావం ఏ సమయంలోనైనా జరిగి పోవచ్చు. అయితే అందరిలో గర్భస్రావం జరిగి తీరాలని లేదు.