పుట:KutunbaniyantranaPaddathulu.djvu/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 61

కొందరు స్తీలకి లూప్ వేయించుకున్న తరువాత కిద్ది నెలలపాటు అప్పుడప్పుడు కాస్త మైల అవుతున్నట్లు కనబడుతుంది. కాని దీని గురించి భయపడనవసరం లేదు. స్టెప్టోవిట్ వంటి బిళ్ళలు తడవకి ఒకటి చొప్పున రోజుకి 4 సార్లు వేసుకుంటే మైలకనబడడం ఆగిపోతుంది. చాలామందికి ఇటువంటి మందు బిళ్ళల అవసరమే ఉండదు. కేవలంకొద్ది చుక్కలు రక్తం కనబడుతుంది. అంతే తప్ప మరేమీ ఉండదు.

కొద్దిమంది స్త్రీలలో లూప్ వేయించుకున్న తరువాత బహిష్టు కాలంలో బ్లీడింగు ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో స్టెప్టోవిట్ టాబ్లెట్ గాని, గైనో సి.వి.వి క్యాప్సుల్స్ వంటివి తడవకి ఒకటి చొప్పున రోజుకి 4 సార్లు 4-5 రోజులు వేసుకుంటే అతిగా బ్లీడింగ్ అవడం ఉండదు. లూప్ వల్ల అతిగా బ్లీడింగు అవడం మూడు-నాలుగు ఋతుస్రావాల్లో జరిగినా తరువాత లేకుండా అయిపోతుంది. ఈ రకంగా అధిక రక్తస్రావం అవడానికి కారణం లూప్ ప్లాస్మినోజిన్ యాక్టి వేటర్ ని ఎక్కువ అయ్యేటట్లు చేస్తుంది. ఇద్ ప్లాస్మినోజిన్‌ని ప్లాస్మిన్ గా మారుస్తుంది. రక్తం ఎక్కువ కారకుండా గడ్డకట్టి ఆపే ఫైబ్రిన్‌ని ప్లాస్మిన్ నష్టపరుస్తుంది. దానితొ బహిష్టు సమయంలో చిట్లిన రక్తనాళాలు, త్వరగా మూసుకుని పోకుండా రక్తస్రావం జరుగుతుంది. అయితే లూప్ వేయించుకున్న ప్రతి స్త్రీలో ఇలా జరగదు.