పుట:KutunbaniyantranaPaddathulu.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. కడుపురాకుండా కాపాడేబిళ్ల "టుడే"

రేవతికి ఇటీవలే వివాహమైంది. అప్పుడే పిల్లలు వద్దనుకుంది. కాని ఏం చేయాలో తెలియలేదు. ఒకసారి డాక్టరు దగ్గరకు వెళ్ళి డాక్టర్, నాకు ఇటీవలనే వివాహమైంది. నేనూ, మావారూ ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. వారొక ఊరులో ఉద్యోగం చేస్తూ వుంటే నేను మరొక ఊరులో, అందుకని మేమిద్దరం రతిలో పాల్గొనగలిగేది నెలకి ఏ మూడు నాలుగు రోజులు మాత్రమే. ఇద్దరం చెరొక ఊరులో వుండడం, ఉద్యోగం చేస్తూ వుండడం వల్ల గర్భం రాకూడదని అనుకున్నాం. అందుకని వారు ఇక్కడికి వచ్ఫినప్పుడు నిరోధ్ వాడుతున్నారు. మరి వారికి చేతకాకపోవడంవల్లనో, మరెందుకనో సరిగ్గా కుదరడం లేదు. తరచుగా జారిపోతుంది. పైగా నిరోధ్ వల్ల తృప్తి వుండడం లేదని తీసి ప్రక్కన పడేస్తారు. అలా చేస్తే కడుపు వస్తుందేమోనని భయం కలుగుతూ వుంటుంది. సరే వారు నిరొధ్ వాడకుండా నేనే కడుపు రాకుండా మాత్రలు వేసుకుందామని అనుకున్నాను. రోజూ రతిలో పాల్గొన్నా పాల్గొనకపోయినా నెలకి ఒకటి, రెండుసార్లే కడుపు రాకుండా బిళ్ళలు మాత్రం రోజూ తప్పనిసరిగా వేసుకొవాలి కదా, అలాగేనని వేసుకో