పుట:KutunbaniyantranaPaddathulu.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 28

ప్యాకెట్లు వాడే స్త్రీలు యిక బహిష్టు సమయంలో కూడా బిళ్ళ ఆపే పనిలేదు.

కుటుంబ నియంత్రణ మాత్రలు

కుటుంబనియంత్రణ కొరకు స్త్రీలు రోజు వాడే బిళ్ళలు బహిష్టు స్రావం కనబడిన అయిదవ రోజునుండి వేసుకోవాలి కదా! మరికొందరు బహిష్టు సమయంలోకూడా సంయోగం జరుపుతారు. ఇటువంటి స్త్రీలు బహిష్టు సమయంలో మాత్రలు వాడకపోవడంవల్ల గర్భం రావడానికీ అవకాశం ఉండదా అనే అనుమానం కొందరు వ్యక్తపరుస్తారు.

నెల నెలా ప్రతి బహిష్టుకి అయిదవ రోజునుంచి కుటుంబ నియంత్రణ మాత్రలు వాడే స్త్రీలు బహిష్టు సమయంలో సంయోగం జరపడంవల్ల గర్భం రావడం జరగదు. అందుకని బహిష్టు సమయంలో జరిపినా ప్రత్యేకంగా మాత్రలు వాడనవసరం లేదు. మామూలుగానే ఐదవ రోజునుంచి వాడితే చాలు.

గర్భనిరోధక మాత్ర - కొన్ని అనుమానాలు

గర్భనిరోధక మాత్రలు కొన్ని నెలలపాటు వాడుతున్నా ఎప్పుడు పిల్లలు కావాలనుకుంటే అప్పుడు మాని వేయవచ్చు. ఈ మాత్రలు కొంతకాలముపాటు వాడుతూ ఉండినట్లయితే, తరువాత పిల్లలు కలగరేమోననే భయము అనవసరము. 75 శాతము స్త్రీలలో ఈ మాత్రలు వాడటము