పుట:KutunbaniyantranaPaddathulu.djvu/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 198

యువకునితో పరిచయమై అతని మాటలు, చేష్టలు ముగ్ధురాల్ని గావించాయి. యవ్వనపు తొలి దినాల వేడిలో సెక్సు గురించి ఆరాటం ఎక్కువగా వుండటం సత్యమే కదా. అటువంటి మానసికోద్రేక స్థితిలో అరుణకుమారి సంయోగము అంటే ఏమిటో, ఆ మధురానుభూతి ఎలా వుంటుందో చవిచూసింది.

దాని ఫలితంగా ఆమె గర్భవతి కావడము జరిగింది. ఆమె గర్భవతి అయిందని తెలుసుకోగానే ఆ యువకుడు పలాయనం చిత్తగించాడు. చేసేదిలేక వివశురాలయిపోయి సరైన డాక్టరు దగ్గరికి వెళ్ళడానికి ముఖం చెల్లక అక్రమ పద్ధతుల్లో గర్భస్రావం కొరకు ప్రయత్నం చేసింది. దానితో పరిస్థితి విషమించి ప్రాణంమీదికి వచ్చి చివరకు డాక్టరు దగ్గరికి రావలసి వచ్చింది.

అక్రమ పద్ధతుల్లో గర్భవిచ్ఛేదనము జరిగే వాటిని క్రిమినల్ అబార్షన్లు అంటారు. ఈ విధంగా గర్భ విచ్ఛేదనానికి ప్రయత్నము చేయటం చట్ట విరుద్ధము, నేరమూను. ఇటువంటి గర్భ విచ్ఛేదనాలన్నీ చాలా మోటు పద్దతిలోను అశాస్త్రీయంగా చేయడం జరుగుతుంది. ఇందువల్ల చాలా సందర్భాలలో ప్రాణం పోవడము జరుగుతుంది కూడాను. మన దేశంలో ముఖ్యంగా అక్రమ పద్దతుల్లో గర్భస్రావాలు వితంతువులు, పెళ్ళికాని స్త్రీలు, అప్పుడప్పుడు పెళ్ళిఅయిన పిల్లలున్న కొందరు స్త్రీలు చేయించుకోవడం చూస్తూ