పుట:KutunbaniyantranaPaddathulu.djvu/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. సక్రమ గర్భస్రావ పద్ధతులు

అబార్షను గ్రర్భస్రావం చేయించుకోవటం చట్ట ప్రకారము అనుమతించబడింది. కనుక ప్రభుత్వ ఆసుపత్రిల్లోను, ప్రైవేటు ఆసుపత్రులలోనూ విరివిగా అబర్షన్మూస:ZWJలు చేస్తున్నారు.

కుటుంబ నియంత్రణకొరకు చేస్తున్న గర్భస్రావాన్ని "యం.టి.పి." అంటున్నారు. యం.టి.పి. అంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రగ్‌నన్సీ.

యం.టి.పి. ల్లో సాధారణముగా చేసేది క్యూరటాజ్ పద్ధతి. గర్భము వచ్చిన మూడు నెలలలోగా క్యూరటాజ్ పద్ధతి ద్వారా గర్భస్రావాన్ని తేలికగా చేయవచ్చు. ఈ పద్దతి ప్రకారం గర్భస్రావము చేసే స్త్రీకి నొప్పి తెలియకుండా తగిన మత్తు ఇంజక్షను ఇవ్వడము జరుగుతుంది. ఈ ఆపరేషను చాలా సులువైనది. గర్భస్రావము చేయడానికి గర్భాశయ కంఠాన్ని (సెర్విక్స్) సన్నపాటి కడ్డీలతో (డైలాటర్స్) వెడల్పు చేసి, తరువాత క్యూరెట్ అనే పనిముట్టుద్వారా గర్భాశయము లోపల పిండాన్ని గీకి వేయడము జరుగుతుంది. ఈ రకంగా గర్భాశయాన్ని పూర్తిగా