పుట:KutunbaniyantranaPaddathulu.djvu/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 190

అండం విడుదల - సంయోగం

అండం విడుదల సంయోగము సమయములోనే అవుతుందా? సంయోగము జరగకపోతే అండము విడుదల ఉండదా? అండము వీర్యకణములతో కలయిక యోని మార్గములో జరుగుతుందా? గర్భాశయంలో జరుగుతుందా? అసలు అండము అంటే రక్తమా లేక కణమా?

సంయోగము జరగడానికి అండము విడుదలకి సంబంధములేదు. అండము విడుదల సంయోగముతో సంబంధము లేకుండా ఎప్పుడైనా విడుదల అవ్వచ్చు. అండముతో పురుష బీజకణం కలయిక గర్భాశయానికి రెండుప్రక్కలా ఉండే అండవాహికపైన ట్యూబుల్లో ఏదో ఒక దానిలో జరుగుతుంది. కాని యోని మార్గంలో కాదు, గర్భాశయములోనూ కాదు పురుష బీజకణముతో కలయికపొందిన అండము గర్భాశయానికి చేరి పిండముగా ఎదగడము జరుగుతుంది. అండము రక్తము కాదు, అది స్త్రీ అండాశయము నుంచి విడుదలయ్యే బీజకణము.

గర్భం రాకపోవడానికి కారణాలు

సరిగ్గా లెక్కకట్టి అండము విడుదలయ్యే దినాల్లో రతిలో పాల్గొన్నా, యెంతకాలానికి కొందరికి గర్భం రాక పోవడానికి కారణము ఏమిటి?