పుట:KutunbaniyantranaPaddathulu.djvu/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 180

సిన వారందరూ ఎంతో కాలం దాంపత్య జీవితం గడిపితేనే తప్ప గర్భవతులు కాలేదు." అంత ఫ్రీగా దాంపత్య జీవితంలో పాల్గొన్నప్పుడే వెంటనె గర్భం రానప్పుడు ఏదో ఒక ఆవేశంలో ఒకసారి మాత్రమే సంయోగం చేసినంత మాత్రాన్నే గర్భం ఎలా వస్తుంది? తానేమీ ఎక్కువ సార్లు సంయోగం చేస్తే కదా! ఇందుకోసం ప్రత్యేకంగా గర్భనిరోధక పద్ధతులు వాడటమెందుకు? ఇలా భావించిన సౌజన్యరావుకి పెళ్ళీపీటలమీద కూర్చోకుండానే సుమిత్రకి వేవిళ్ళు కనబడటం ఆశ్చర్యం కలిగించింది.

ఒక్కసారే సంయోగం జరిపినా గర్భంవస్తుందా

ఎందుకు రాదూ? సుమిత్ర విషయంలో జరిగిందేమిటి? అది మొట్టమొదటి సంయోగంమా, లేక తరచుగా పాల్గొనే సంయోగమా అనే దాన్ని బట్టి గర్భం రావడం ఆధారపడి వుండదు. అండం విడుదలయ్యే సమయంలో సంయోగంలో పాల్గొంటే అది మొట్టమొదటి సంయోగమైనా గర్భం రావడానికి చాలా హెచ్చు అవకాశాలు వున్నాయి. అండం విడుదలయ్యే రోజుల్లో కాకుండా ఇతర రోజుల్లో ఎనిసార్లు సంయోగంలో పాల్గొన్నా గర్భం రాదు. అందుచేత గర్భం రావడానికి ఎక్కువసార్లు సంయోగంలో పాల్గొనడానికి, పాల్గొనకపొవడానికి సంబంధం లేదు. అయితే చాలామంది దాంపత్య జీవితంలో వరసగా పాల్గొన్నా