పుట:KutunbaniyantranaPaddathulu.djvu/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 177

ఎదుగుదల ప్రారంభం అవుతుంది. 3 నెలలు నిండగానే పొత్తికడుపు దగ్గర గట్టిగా తగిలినా అయిదవనెల నుంచి స్పష్టంగా అందరూ గుర్చించే విధంగా పొత్తి కడుపు దగ్గర ఎత్తుగా కనబడుతుందీ. గర్భాశయం ఎదుగుదలతో పాటు కడుపుమీద తెల్లని చారలు ప్రారంభిస్తాయి. ఈ చారలు కూడా స్త్రీ ఒక్కసారి గర్భవతి అయినట్లుగా తెలియజేస్తాయి. కొందరిలో నెలలు పెరుగుతున్నకొద్దీ కడుపులో నొప్పి లేకుండా కడుపు బిగబట్టి వదిలినట్లుగా అనేకసార్లు అనిపిస్తూ ఉంటుంది. అయిదవనెల నిండిన తరువాత కడుపుమీద చెయ్యివేసి బిడ్డని నొక్కినట్లయితే, గర్భాశయంలోని బిడ్డని తేలికగా కదిపినట్లు అవుతుంది. ఈ సమయంలో బిడ్డ సైజుకంటే ఉమ్మ నీరు శాతం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఆరవనెల నిండిన దగ్గరనుంచీ బిడ్డ కదలికలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఈ సమయానికి బిడ్డ పెరగగా గర్భాశయం తల్లి బొడ్డుదాకా పెరుగుతుంది. గర్భాశయంలో ఉన్న బిడ్ద గుండె కొట్టుకోవడం కూడా స్టెతస్కోపు ద్వారాగాని ఫీటస్కోప్‌తో గాని స్పష్టంగా వినవచ్చు. బిడ్డ శరీరభాగాన్ని పొట్టపై నుంచి అదిమి తెలుసుకోవచ్చు కూడా.

ఏడవ నెల నుంచీ కనబడే లక్షణాలు

నెలలు నిండుతున్న కొద్దీ వక్షోజాలు నిండుగా, పెద్దవిగా తయారవుతాయి. కాని మడమల దగ్గర, పాదాల దగ్గర