పుట:KutunbaniyantranaPaddathulu.djvu/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 176

భోజనంమీద ఆసక్తి చూపించకపోవడం, బొగ్గులు, మట్టి, బియ్యంలోని రాళ్ళు లాంటివి తినడం చేస్తూ వుంటారు.

గర్భిణీ స్త్రీలలో బరువు పెరుగుదల

స్త్రీకి కడుపువచ్చిన మొదటి నెలలోబరువు పెరగడం జరగకపోయినా 2వ 3వ నెలల్లో ఒక్కొక్క పౌను, నాలుగు అయిదవ నెలల్లో నెల ఒక్కింటికి నాలుగు పౌన్లు, ఆరుఏడు నెలల్లో నెలఒక్కింటికి అయిదుపౌన్లు, ఎనిమిదితొమ్మిది నెలల్లో నెల ఒక్కింటికి 3 పౌనులు బరువు ఎక్కడం జరుగుతుంది.

నాలుగవ నెలనుంచీ నలుగురికీ తెలిసే లక్షణాలు

వేవిళ్ళు కాస్త తగ్గినట్లు అనిపించినా నోట్లో ఉమ్మా మాత్రం ఎక్కువ అవుతుంది. వక్షోజాలు సైజు పెరగడం ప్రత్యేకంగా కనబడుతుంది. ఈ విషయంలో అయిదవ నెల దాటిన తరువాత మరింత త్వరగా మార్పు కనబడుతుంది. నాలుగు నెలలు నిండిన పదిహేను రోజుల్లో కడుపులో బిడ్డ కదలడం ప్రారంభమవుతుంది.

మొదటి కాన్పులోకంటే తరువాత కాన్పుల్లో బిడ్డ కదలికలు ఇంకా యింతకంటే ముందుగానే తెలుస్తాయి. పిండం గర్భకోశంలో ఎదుగుదలతో పాటు గర్భాశయం