పుట:KutunbaniyantranaPaddathulu.djvu/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 165

గ్రావిండెక్స్ టెస్టు

మూత్రం పరీక్ష ద్వారా గర్భం వచ్చిందీ లేనిదీ తెలుసుకునే పరీక్షా పద్దతుల్లో గ్రావిండెక్స్ టెస్టు ఒకటి. ఈ టెస్టు ద్వారా నెల తప్పిన తరువాత 2 నుంచి 5 రోజులలోగా గర్భం వచ్చినదీ లేనిదీ నిర్ధారణ చేయవచ్చు.

గ్రావిండెక్సు టెస్టు చేయు విధానం

ఈ టెస్టు చేయడానికి మార్కెట్టులో రెండు రసాయనిక పదార్ధాలు ఒక కిట్‌గా దొరుకుతాయి. ఈ కిట్‌లో ఉండే రెండు సంయోగ పదార్ధాలు 1) యాంటీబాడి 2)యాంటీజిన్.

పరీక్ష చేయవలసిన స్త్రీ మూత్రాన్ని ఒక చిన్న సీసాలో కొద్ది చుక్కలు పట్టితే చాలు. అలా కలెక్టుచేసిన మూత్రాన్ని తీసికొని లేబరటరీలో ఒక గాజు ప్లేటు (గ్లాసు స్లైడ్) మీద ఒక చుక్క వేస్తారు. దానికి ఒక చుక్క యాంటీబాడీ సంయోగ పదార్ధాన్ని కలుపుతారు. కిట్‌లో ఇవ్వబడిన పుల్లతో గాజుప్లేటు మీద వేసిన రెండు చుక్కలని చక్కగా కలుపుతారు. తరువాత 30 సెకండ్లు పాటు గాజుప్లేటుని (గ్లాస్ స్లైడుని) ఇటు అటు కుదుపుతారు. ఆ తరువాత కిట్‌లో ఉన్న మరో సంయోగ పదార్ధం యాంటీ జన్‌ని బాగా కుదిపిన ఒక చుక్కని కూడా దానితో కలుపు