పుట:KutunbaniyantranaPaddathulu.djvu/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 159

ఒకటి - రెండు సంవత్సరాల్లో మార్కెట్టులోకి విడుదల అవుతుంది కూడా.

స్త్రీల వాడుకకోసం తయారు చేయబడిన ఈ కండోమ్ (నిరోధ్) యోనిలో అమరే విధంగా పాలీయురిధేన్ శాక్‌తో రూపొందించబడింది. ఇటువంటి 'స్త్రీల నిరోధ్' 15 సెంటీ మీటర్ల పొడవు, 7 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ నిరోధ్ మూతి దగ్గరఉండే పాలియురేధేన్ రింగ్ యోని ముఖద్వారం దగ్గర పట్టి ఉంచితే తేలికగా ముడవబడే రింగ్ యోని లోపల గర్భాశయ కంఠం దగ్గర పట్టుకొని ఉంటుంది. ఈ రకంగా అమరడంవల్ల ఈ నిరోధ్ యోనిమార్గం లోపల "రబ్బరు సంచి" లాగా ఉంటుంది.

సంయోగంలో పాల్గొన్నప్పుడు స్త్రీ యోనిలో అమరిన ఈ పల్చని రబ్బరు తొడుగులో పురుషాంగం ప్రవేశిస్తుంది. స్త్రీ యోని కండరాలతో పురుషాంగానికి తిన్నగా సంబందం రాదు. అయితే స్త్రీలకి సంబంబందించిన నిరోధ్ చాలా పలచగా ఉండబట్టి పురుషునికి అది అడ్డు ఉన్నట్లే అనిపించదు. మామూలుగానే యోనిలో సంయోగం జరుపుతున్నట్లే ఉంటుంది. స్త్రీకి కూడా సెక్సు స్పందనలు కలగడంలో గాని, సుఖప్రాప్తి కలగడంలోగాని ఎటువంటి తేడా అనిపించదు. మామూలుగా యోనిలో ద్రవాలు ఊరుతూ సంయోగ సమయంలో జారుడుగా అనిపించినట్లే ఈ నిరోద్ లో జారుడుగా ఉండేటట్లు రూపొందించబడించి.