పుట:KutunbaniyantranaPaddathulu.djvu/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 154

గర్భాశయ కంఠం దగ్గర పూతగాగాని, పుండుగా గాని ఏర్పడినప్పుడు తెల్లబట్ట ఎక్కువగా అవుతూఉంటుంది. గర్భాశయ కంఠం దగ్గర పుండుగా ఏర్పడి తెల్లబట్ట అవడమనేది కాన్పులవలననే కాకుండా అబార్షన్ల వలన, గనేరియా వలన, కాన్పులయినప్పుడు శుభ్రత పాటించక పోవడం వలన కూడా జరుగుతుంది. ఆసుపత్రికి తెల్లబట్ట అవుతోందని చూపించుకోడానికి వెళ్ళే ప్రతీ అయిదుగురిలో నలుగురికి గర్భాశయ కంఠం దగ్గర పై కాణాలవలన పూతగాని, పుండుగాని ఏర్పడటమే కారణం. మందులతో గాని కరెంటుతో మాడ్చటం వలన ఉపశాంతి కలగక బాధాకరంగా ఉన్నప్పడు గర్భాశయ కంఠాన్ని కొంతభాగం ఆపరేషను చేసి తీసివేయడమో, గర్భసంచిని తీసివేయడమో మార్గం అవుతుంది. అయితే తెల్లబట్ట అవడానికి అసలుకారణాన్ని ముందు నిర్ధారించాలి.

ఆపరేషను చేయించుకోవడమువలన ఒళ్ళు వస్తుందని భావించడం ఆపోహ మాత్రమే, ఒకవేళ ఒళ్ళు వచ్చినా ఆపరేషను చేయించుకున్నప్పుడు కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకొని, పళ్ళు - పాలు ఇతర బలవర్ధక పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడమే కారణం. ఇలా వచ్చిన మంచి ఆరోగ్యం కొందరికి చక్కగా కొనసాగితే, మరికొందరు స్త్రీలు తరువాత తిరిగి తగిన ఆహారం, విశ్రాంతి తీసుకోక యధాస్థితికి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరికొందరు స్త్రీలకి ఆపరే