పుట:KutunbaniyantranaPaddathulu.djvu/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 150

లుంబో - శాక్రల్‌స్ట్రయిస్ , ఇంటర్ వెర్టెబ్రల్ డిస్కు ప్రొలాప్స్, స్పాండిలోలిస్థిను శాక్రలైజేషనుల వలన అని గ్రహించలేక ఒకవేళ ట్యూబెక్టమీ చేయించుకొంటే దానికి ఆపాదిస్తారు. అయితే గర్భవతి అయిన స్త్రీ కాన్పుకి ముందూ, తరువాత కూడా తగిన జాగ్రత్త వహించి వెన్నుకి సంబంధించిన తగిన వ్యాయామము చేస్తే వెన్నుపూసలలో వెసులుబాటు కలిగినా బాధలేకుండా చేసుకోవచ్చు.

మరికొన్ని లక్షణాలు

చాలామంది స్త్రీలలో కాన్పుల సమయంలో గర్భాశయ కంఠము కొద్దిగా గాయమై ఎప్పటికీ పచ్చిగా ఉండి పోతుంది. మరి కొందరిలో కాన్పు సమయంలో తగిన శుభ్రతని పాటించకపోతే బాక్టీరియా క్రిములు గర్భాశయ కంఠము దగ్గరికి చేరుతాయి. దీనివల్ల అక్కడ పుండులాగా అవుతుంది. దీనివల్ల వైట్ డిశ్చార్జి అవడము, నడుము నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అసలు విషయము తెలుసుకోలేక కాన్పు అవగానే ట్యూబెక్టమీ చేయించుకుని నడుమునొప్పి అనిపిస్తూ ఉంటే ఆపరేషను చేయించుకుని బాధ తెచ్చి పెట్టుకుంటున్నామని అనుకుంటు ఉంటారు. వజైనల్ స్పెక్యులమ్ ద్వారా గర్భాశయ కంఠాన్ని పరీక్షచేసి చూస్తే అసలు కారణము బయట పడుతుంది