పుట:KutunbaniyantranaPaddathulu.djvu/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 148

కని ఉంటోంది? దీనికంతటికీ కారణం ఆపరేషన్ చేయించుకోవడం, చేయించుకోక పోవడం కారణం కానేకాదు. కేవలం కాన్పులు అవడమే ఇందుకు కారణము. ఒకటి రెండు కాన్పులు అయినాయా, పది కాన్పులు అయినాయా అనే దాన్నిబట్టి నడుమునొప్పి రావడం, రాకపోవడం ఆధారపడి లేదు,. అధికశాతం కేసుల్లో ఒకటి రెండు కాన్పులలోనే వెన్నుకి సంబంధించిన కండరాలలో బలహీనత కలగడమే ముఖ్య కారణము. కండరాలలో బలహీనత రాఫడానికి, వెసులుబాటు కలగడానికి స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు గర్భములో పిండము పెరుగుతున్న కొద్దీ నడ్డిఎముకపై ఒత్తిడి కలిగి స్త్రీ మామూలుగా కూర్చోవడము, పడుకొనలేకపోవడమో కారణము. దానివలన వెన్నుపూసల పొజిషన్ లో మార్పు వచ్చి వెన్నులో బాధ ప్రారంభం అవుతుంది. ఈ భాధ స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడే ప్రారంభం అవుతుంది. ఆసమయంలో గర్భవతి అయిన స్త్రీ నడుమునొప్పి మామూలే అని సరిపెట్టుకుంటుంది. కాన్పు తరువాత కూడా ఆ నొప్పి ఉంటూ ఉంటే బాలింతరాలికి బలహీనత సామాన్యమేనని అనుకుంటుంది. కాని ఒకవేళ ట్యూబక్టమీ చేయించుకున్న తరువాత పై కారణాల వలననే నొప్పి అనిపిస్తూ ఉన్నా అదంతా గమనించక ఆపరేషన్ వలననే అని అనవసరముగా ఆపాదిస్తారు.

జాగ్రత్తగా గమనిస్తే కాన్పులైన స్త్రీలు చాలామంది