పుట:KutunbaniyantranaPaddathulu.djvu/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 146

వుంటే ఆపరేషన్ వలనేనని భావించి ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నామా అని దిగులుపడిపోతూ వుంటారు. అలా కాకుండా అసలు కారణాన్ని గుర్తించి తగిన మందులు వాడినట్లయితే అన్నీ తగ్గిపోయి ఆపరేషన్ వలన కాదని అర్ధం అవుతుంది.

ట్యూబెక్టమీ చేయించుకుంటే గడ్డలు వస్తాయా?

ఈనాడు ట్యూబెక్టమీ బాగా ప్రచారంలో ఉండబట్టే చాలామంది స్త్రీలు కాన్పు అవగానే ఆపరేషన్ చేయించుకుంటున్నారు. కానీ వీరిలో కొందరికి గర్భసంచి దగ్గర పుండుగాని గడ్దగాని ఉండడం జరుగుతూ ఉంటుంది. నిదానంగా ఆ పుండుగాని గడ్డగాని పెరిగితే బాధ కలుగుతూ ఉంటుంది. అటువంటి స్త్రీలు అంతకుముందు ట్యూబెక్టమీ చేయించుకున్నా తిరిగి ఆపరేషన్ చేయించుకుని గర్భసంచిని పూర్తిగా తీసివేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. కాని ఇది తెలియక ఆ స్త్రీలుగాని, ఇది చూసిన తక్కిన స్త్రీలుగాని, ట్యూబెక్టమీ ఛెయించుకుంటే గడ్డలు, పుండ్లు ఏర్పడి తిరిగి పెద్ద ఆపరేషన్ చేయించుకోవలసి వస్తుందని తప్పుగా భావిస్తూ ఉంటారు. కాని ఏమాత్రం ఆలోచించినా ఇది తప్పు అభిప్రాయం అని తేలిపోతుంది.