పుట:KutunbaniyantranaPaddathulu.djvu/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 143

ఇంటి దగ్గర కాన్పు అయిన ఇందిర సంగతి ఇలా వుండగా, ఒక ఆసుపత్రిలో ఒకేరోజు అనేకమంది ట్యూబెక్టమీ చేయించుకున్న కొందరికి కుట్లుదగ్గర నొప్పి, కడుపులో నొప్పి రావడం జరిగాయి. ఇలా రాఫడం ఆపరేషను చేయించుకుంటే అందరికీ రావాలని లేదు. దీనికి ఆపరేషను చేసిన డాక్టరు పూర్తి శుభ్రతని పాటించక పోవడం, ఆపరేషనుకి సంబంధించిన పనిముట్లని పరిశుభ్రమయినవిగా ఉన్నవీ లేనిదీ చూసి శ్రద్ధ తీసుకోకపొవడం, దానికి తగ్గట్టుగా ఆపరేషను తరువాత పూర్తి మోతాదులో పెన్సిలిన్ లాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వకపోవడం కొన్ని కారణాలు. డాక్టరు ఆపరేషను విషయంలో పూర్తి పరిశుభ్రతని పాటించకపోతే బాక్టీరియా క్రిములు ఆపరేషను చేసినప్పుడు లోపలికి ప్రవేశించి గర్బకోశానికి సంబందించిన ట్యూబులు వాచేందుకు, చీము పట్టేందుకు కారణం అవుతాయి. అలాగే కుట్లుకూడా చీము పట్టుతాయి. కడుపులోపల ట్యూబులు వాచినట్లయితే గడ్దలుగా తయారై కడుపులో నొప్పిరావడం, నడుము నొప్పి కలగడం ఉంటాయి. ఒకేచోట అనేకమందికి ఆపరేషను చేయవలసి వచ్చినప్పటికి ఆపరేషను పనిముట్ల విషయంలోనూ, ఆపరేషను సమయంలోనూ పూర్తి పరిశుభ్రతని పాటీంచినట్లయితే, పూర్తి మోతాదులో యాంటిబయాటిక్స్ వాడినట్లయితే,ఆపరేషను తరువాత కడుపులో నొప్పి రావాడం ఉండదు. కలలో కూడా దాని గురించి తల