పుట:KutunbaniyantranaPaddathulu.djvu/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 141

కని భర్త బార్యమీద అనురాగంతో ఆమెకు మళ్ళీ ఇబ్బంది కలిగించకుండా తానే ముందుకువచ్చి ఆపరేషను చేయించుకున్నట్లయితే ఎంతో తేలికలో అయిపోతుంది. పైగా భార్య ప్రేమకి పాత్రుడవుతాడు. కాన్పులవల్ల బాధపడిన తనకు తీరిగి బాధ కలిగించకుండా భర్తే ఆపరేషను చేయించేసుకుంటే అతనిమీద భార్యకి అనురాగం, అభిమానం పెరగకుండా ఎలా ఉంటాయి? మరి అటువంటి దాంపత్యం ఆదర్శ దాంపత్యం కాకుండా ఉంటుందా?

ట్యూబెక్టమీవల్ల కడుపులో నొప్పి వస్తుందా ?

ఇంటి దగ్గరే కాన్పు అయిన ఇందిర మూడవరోజునే ఆసుపత్రికి వెళ్ళి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుంది. ఏడవరోజున కుట్లు తీయించుకుని ఇంటికి వెళ్ళిన ఇందిర కొద్ది రోజులకే కడుపులో నొప్పి, తెల్లబట్ట, జ్వరం అంటూ ఆసుపత్రికి వచ్చింది. ప్రక్కనే వున్న ముసలమ్మ ఊరుకోక "వద్దంటే విన్నదికాదు ఆపరేషని చేయించుకుని అనవసరంగా బాధ తెచ్చి పెట్టుకుంది" అంటూ మామూలు ధోరణిలో మాట్లాడసాగింది. వాస్తవానికి ఇందిరకి వచ్చిన జ్వరం, కడుపులోనొప్పి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడంవల్ల కాదు. ఆపరేషన్ చేయించుకోక పోయినా ఇందిరకి కడుపులోనొప్పి జ్వరం వచ్చి ఉండేవే. అది ఎలా సంభవం అని అనుమనం కలగవచ్చు