పుట:KutunbaniyantranaPaddathulu.djvu/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 14

అదుపు లేకుండా జనాభా పెరిగి పోవడంతో దేశం ప్రగతికి ఎంతో అవరోధం ఏర్పడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు జనాభా పెరుగుదలని అరికట్టుకుని, సకలసౌకర్యాలు కలిగించుకుని హాయిగా ఉంటే, తక్కిన దేశాలు జనాభా విపరీతంగా పెరిగిపోతున్నందున తినడానికి సరైన తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక, ఉండటానికి సరైన వసతిలేక బాధపడుతున్నారు. ప్రభుత్వం ఏదో తమకి అన్ని సౌకర్యాలు సమకూర్చాలని అనుకోవడంకాక, ఎవరిమట్టుకు వారు ఒకరు ఇద్దరు పిల్లలలతో కుటుంబాన్ని పరిమితం చేసుకోవాలి. చిన్నకుటుంబం చింతలు లేని కుటుంబం అని తెలుసుకోవాలి. పరిమితికి మించి సంతానాన్ని కని ఆ సంతానానికి తగిన తిండి పెట్టలేక, తగిన సౌకర్యాలు కలిగించలేక అనారోగ్యంగా, అశక్తులుగా తయారు చేసే కంటే కన్నటువంటి ఒకరిద్దరి పిల్లలని ఆరోగ్యంగా పెంచడం, చక్కగా వృద్ధిలోనికి తీసుకుని రావడం ప్రతీ తల్లీ - తండ్రి చేయవలసిన పని. అలాగే ఆడపిల్ల తక్కువ అనీ, మగపిల్లవాడు ఎక్కువగా భావించి మగపిల్లవాడు పుట్టేంతవరకు పిల్లలని కంటూ పోవడం తప్పు. అలా కనడంవల్ల ఒరిగేదేమీ లేదు సరికదా కష్టాలని కోరి తెచ్చిపెట్టుకోవడమే !

ఆడపిల్ల అయినా ఒకటే, మగ పిల్లవాడు అయినా ఒకటే. ఆలోచన లేకుండా పిల్లలని కంటూ ఉంటే ఆ తల్లి దండ్రులు ఇబ్బందులపాలు అవడమే కాకుండా దేశానికి