పుట:KutunbaniyantranaPaddathulu.djvu/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 129

వేసక్టమీ ఆరంభం - అభివృద్ధి

వేసక్టమీ ఆపరేషనుని మొదట్లో ఇంగ్లీషు సర్జన్ జాన్ హంటర్ 1775 లో చేసేవారు. తరువాత 1830 లో ఆస్ట్‌లీ కూపర్ దీనిని మరింత ఎక్కువ చేసేవారు. అటుపిమ్మట హర్రీ షార్స్ అనె అమెరికన్ సర్జన్ 1899 లో దీనిని మరింత ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. 1950 నుంచి పశ్చిమ ఆసియాలో కుటుంబ నియంత్రణ పద్ధతిగా విస్తృత ప్రాచుర్యం పొందింది. 1956 నుంచి భారతదేశంలో కూడా జాతీయ కుటుంబ నియంత్రణ పద్ధతిగా స్వీకరించి విస్తృతంగా అమలు పరచడం జరుగుతోంది.

1976-77 సంవత్సరంలో భారతదేశంలో 6 మిలియన్లు పురుషులు వాసెక్టమీ చేయిందుకోగా 1980--81 వచ్చేసరికి 21 మిలియన్లు ఈ ఆపరేషను చేయించుకున్నారు.

* * *