పుట:KutunbaniyantranaPaddathulu.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోతున్న జనాభాని అరికట్టకపోతే మరికొన్ని క్రొత్త సమస్యలు రాక మానవు. పెరిగిపోతున్న జనాభావల్ల బాధలు కలుగక మానవు.

ప్రపంచ దేశాల్లో అధిక జనాభా రీత్యా చూస్తే చైనా ప్రధమ స్థానం ఆక్రమిస్తుంది.

దాని తరువాత భారతదేశం

అధిక జనాభారీత్యా భారతదేశానికి రెండవస్థానమే అయినా భూభాగం వైశాల్యంరీత్యాచూస్తే చైనాకి ఉన్న భూభాగంలో ఏడవవంతే. అలాగే ప్రపంచ జనాభాలో 15 శాతం జనాభా మన దేశంలోనేఉంది. కాని ప్రపంచ భూభాగం రీత్యా చూస్తే మనకి 2.4% మాత్రమే భూభాగం ఉంది. అమెరికాతో పోల్చి చూస్తే మన దేశ భూభాగం అయిదింట రెండుమాత్రమే ఉంది. అయితే జనాభా రీత్యా చూస్తే అమెరికా జనాభాకి మన దేశ జనాభా రెండున్నర రెట్లు ఎక్కువ ఉంది.

ఇంకొక విషయమేటంటే మన దేశ జనాభాలో 42 శాతం మంది 15 సంవత్సరాలలోపు వారు. అదే 40 సంవత్సరాల లోపు వారిని తీసుకుంటే మనదేశ జనాభాలో 75 శాతం పైగా ఉన్నారు. ఒక స్త్రీ 17 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకొని ఏ రకంగానూ కుటుంబ నియంత్రణని పాటించకపోతే తన సంతాన సాఫల్యత కాలంలో 13 మంది బిడ్డలని కనగలదు. మన దేశములో కుటుంబనియం