పుట:KutunbaniyantranaPaddathulu.djvu/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 108

ట్యూబులు మూసుకుని పోయే విధంగా చేయాలని ఒక ఆలోచన ఉంది. అయితే అలా చేయడం వలన ఆ ట్యూబులకి సంబందించిన మొత్తం మార్గాలు మూసుకుని పోతాయి. దానివల్ల ఎప్పుడైనా సంతానం కావాలనుకున్నప్పుడు రీకెనలైజేషన్ ఆపరేషను చేయడానికి అవకాశం లేకుండా పోతుంది.

ట్యూబులు మూసుకుని పోయే ద్రవం బదులుగా వీర్యవాహికలకిగాని, అండవాహికిలకి గానీ క్లిప్పులు, రింగ్‌లు బిగించే పద్ధతి గురించి కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. సంతానం తిరిగి కావాలనుకున్నప్పుడు ఈక్లిప్పులని, రింగులని తీసివేస్తే సంతానం కలిగే అవకాశం ఉండవచ్చు. ఈ విషయంలో ప్రయోగాలు జరుగుతున్నాయి.

* * *