పుట:KutunbaniyantranaPaddathulu.djvu/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 106

అయింది. వాక్సీను వల్ల శరీరంలో యాంటీబాడిస్ తయారయి, వీర్యకణాలని అండంతో కలయిక పొందకుండా నిర్మూలించడం చేయవచ్చు. ఇటువంటి వాక్సీన్ తయారు చేయడంలో వైధ్య శాస్త్రజ్ఞులు విజయం సాధించగలిగినట్ల యితే కుటుంబనియంత్రణ విషయంలో ఎంతో ప్రగతి సాధించినట్లే అవుతుంది. ఈ నాడు గర్భనిరోధక ప్రక్రియలుగా కొత్తగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నా అవన్నీ యింకా ఆచరణలో అంత ఉపయోగకరంగా లేకుండా వున్నాయి.

క్రొత్త పద్ధతులు క్రొత్త ఆలోచనలు

పై విధంగా చూసినట్లయితే కుటుంబనియంత్రణకి సంబంధించిన అనేక క్రొత్త పద్ధతులు, క్రొత్త ఆలోచనలు వస్తున్నాయి.

గర్భాశయంలో ప్రవేశపెట్టే సంతాన నిరోధ సాధనాల్లో లీస్సీస్ లూప్, కాపర్ -టి లూప్ లే కాకుండా సిల్వర్ లూప్ లు, ప్రొజిస్టేషనల్ స్టిరాయిడ్స్ ప్రయోగాల్లో ఉన్నాయి.

ముక్కుకి సంబంధించిన మ్యూకస్ పొరల్లో సంతాన నిరోధానికి స్టిరాయిడ్స్ అమర్చి సంతానం కలగకుండా చేసే ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి ప్రయోగాలు కోతుల విషయంలో జరపగా చక్కని ఫలితాలు కనబడ్డాయి. సంతాన నిరోధానికి నోటిద్వారా తీసు