పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇచ్చుటకు లింగముగుంట వచ్చి సంబంధము నిశ్చయించుకొని లగ్నముగూడ నిర్ణయించుకొని, పెండ్లికి తరలిరమ్మని చెప్పిపోయిరి. పిల్ల నిచ్చినవా రెంతవారైనను పిల్లను తీసికొనువారికి లొంగి ఉండవలసివచ్చుట అందరు ఎరిగినదే. కోదండరామయ్యగారు మిక్కిలి ఆడంబరప్రియుడగుటచేతను తండ్రి కోటయ్యగారికి ఆయన జరిగించుపనులు కొన్ని యిష్టములేకున్నను తనమాటకు చెల్లుబడిలేదని యూరకుండుటచేతను వియ్యాలవారికంటె తాము పై చెయ్యి అనిపించుకొనవలెనని తరలిపోవుటకు గొప్పప్రయత్నములు గావించెను. ఊరిలోని ఆసామీల బండ్ల నన్నింటిని చేర్చి, బండి కొక్కరిని కూర్చుండబెట్టి ప్రయాణముసాగించెను. ముందుగా తనక్రింద నున్న సాహెబులను పంపి గ్రామములలో ఫలానివారు పెండ్లికి తరలిపోవుచున్నారని దండోరావేయించి మధ్య నొకటిరెండు గ్రామములలో నూరివెలుపల బాగుచేయించి వీరు బండ్లతో వచ్చునప్పటికి ఎద్దులకుమేత, నీళ్లు సిద్ధముచేయించి డేరాను పాతించి, వంటలుచేసుకొనుటకు వసతులుమొదలగు నేర్పాట్లు గావించెను. కోదండరామయ్యగారు గుఱ్ఱమునెక్కి ముందు బోవుచుండ వెనుకనుండి మంగళవాద్యములతో పెండ్లి కొడు కెక్కిన మేనా, పిమ్మట ఆడవారెక్కిన పెట్టెబండి, దాని వెనుక ఊరివారివలన కట్టించిన రెండెద్దులబండ్లును వరుసగా గ్రామములగుండ మెల్లమెల్లగ ప్రయాణముచేయుచు మధ్య వసతు లమర్చిన గ్రామములలో బసచేయుచు ఉప్పుటూరు అట్టహాసములతో చేరిరి. బెండపూడివారు సంపన్నులైనను ఇంత ఆడంబరములు, అట్టహాసములకు నభ్యాసపడినవారు కారు. అయినను వీరికి ఏవిధమైన లోపము జరుగకుండ చక్కని యేర్పా