పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయించుచుండెను. ఎక్కి తిరుగుటకు తెల్లని పెద్దగుఱ్ఱమును, రెండెద్దులపెట్టెబండియు, ఇతరగ్రామములనుండి ఉద్యోగులు మొదలగువారు వచ్చినపుడు వారిసౌకర్యమునిమిత్తము డేరాయును సమకూర్చుకొనెను. ఈయన భోగపురుషు డగుటచే చెడిపోయిన ఒక బ్రాహ్మణస్త్రీని ఉంచుకొని దాని నిమిత్తము చిన్నమేడను కట్టించెను.

మరియును కోర్టులలో వ్యాజ్యములుండు కక్షిదారులకు సలహాలనిచ్చి వారివలన బహుమానములు పొందుచుండెను. ఇట్లు సలహాలు పొంది జయించిన కక్షిదారులు తొమ్మిదియకరముల భూమి నిచ్చి తెల్లని పెద్దగుఱ్ఱము నిచ్చి దానిపై నెక్కించి ఆయనకు ఊరేగింపుటుత్సవము గావించిరట. మరియొకరు మంచి టేకుకలప కొనితెచ్చి, వీరిగ్రామములో నూరివెలుపల పండ్రెండుదూలముల పశువులశాలను కట్టియిచ్చిరి. మరియు ఈయన గరిడీనేర్చిన జవాను. ఎప్పుడును ఫైలువానువంటి ముసల్మానొకడువెంట తైనాతిగా నుండెను. భజనలుచేయుట యం దెక్కువ ప్రీతియగుటచే సమీపమున నున్న క్రొత్తపల్లినుండి హరిదాసులను బిలిపించి, శనివారమునాడు దేవాలయములో భజనలు, పూజలు గావించి భోజనములుపెట్టి బహూకరించుచుండెడివాడు

బాపట్లతాలూకా ఉప్పుటూరిలో బెండపూడివారిది గొప్ప భూవసతిగల ప్రసిద్ధివంశము. వారికిని ఉప్పుటూరిగ్రామమునకు కరిణిక మిరాసికలదు. వీరిపిల్లను కోదండరామయ్యగారి తమ్మునకు