పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మగుచుండగనే వెలుపలకు వచ్చెను. బందరుకాపురస్తులు కట్టమూడి చిదంబరరావు అనువారు భార్యతోగూడ ప్రయాణము చేయుచుండిరి. వారికి కావలయువస్తువు లన్నియు జాగ్రత్తగ పట్నమునుండియే తెచ్చుకొనిరి గాన వారును త్వరలోనే వంటచేసుకొని భోజనముచేసిరి.

కాలువపొడవున పలుచోటుల సముద్రపుపోటుతో ఇసుక కొట్టుకొనివచ్చి దిబ్బలు పెట్టియుండుటచేత పడవలు తేలుటయే కష్టముగానుండెను. దిబ్బలమీద పడవలవారును మే మందరమునుగూడ కలసి పడవలను నెట్టుచు దాటించవలసివచ్చుచుండెను. ఇందువలన ప్రయాణము సాగక దినములు గడచిపోవుచుండెను. నిత్యమును పచ్చిపులుసు మెతుకులే గతియయ్యను. అవియేనియు ఒక్కపూటమాత్రమే. ఇట్లు మేము క్రొత్తపట్టణము నొద్దకు వచ్చునప్పటికి పదునైదురోజులు పట్టెను. ఆయూరు చేరుసరికి మట్టమధ్యాహ్న మాయెను. కాలువకును ఊరికిని చాలదూరము అయినను ఏపూటకూలిబసలోనో భోజనము చేయవచ్చునను ఆశతో ఎండచే తల మాడుచున్నను కాళ్లు కాలుచున్నను ఊరికి చేరితిమి. ఆయెండకు తాళలేక పిట్టయొకటి చెట్టునుండి జారిపడెను. అట్టియెండలో మేము ఊరుచేరినను ఒక అమ్మ ఇంత అన్నముపెట్టి ఏదోపచ్చడివేసి నీళ్లమజ్జిగతో సరిపుచ్చెను. పడవప్రయాణమిక చాలునని బండిచేసుకొని చినగంజాము చేరి అక్కడనుండి మరియొకబండిమీద ఎట్లో గుంటూరు చేరునప్పటికి ప్రాణములు శల్యగతములై యుండుటచేత మాతండ్రిగార్లు మమ్ముజూచి మిక్కిలి భయపడిరి. ఎట్లో కొన్నివారములకు