పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలుజారి అప్పయ్యదీక్షితులు కాలువలో రెండుపడవలసందున పడిపోయెను. చీకటిగ నుండెను. పడవక్రిందికి అతడు మునిగిపోయెనేమోయని గొప్పభయము తోచెను. దైవానుగ్రహము వలన ఎట్లో పడవకళాసులు నీళ్ళలోనుండి అతనిని లేవనెత్తిరి. ఇట్లు ప్రాణోపద్రవముతప్పినది. ఈ అప్పయ్యదీక్షితులు శ్రౌతస్మార్తకర్మలు నేర్చినపిమ్మట ఇంగ్లీషుచదువుటకు ప్రారంభించినాడు. ఫస్టుఫారములో ప్రవేశించునప్పటికి ఆయనవయస్సు పదునారేండ్లు. నేను ఈ మొదటితరగతిలో పదమూడవఏట ప్రవేశించితిని. కనుక ఆయన నాకంటె పెద్దవాడు, పొడవరి, దృడకాయుడు. క్లాసులో మిక్కిలి బుద్ధిశాలియని పేరుపొందెను. హెడ్‌మాష్టరు వెంకటసుబ్బారావుగా రతనిప్రజ్ఞకు మెచ్చుకొనుచుండెడివారు. కావున ఇట్టియుపద్రవము సంభవించినందుకు శాస్త్రిగారు మిక్కిలి భయాక్రాంతులైరి. కాని ఉపద్రవము తప్పినపిమ్మట ఇతడు గొప్పవాడుకానున్నాడని యోచించి సంతసించిరి. మరునా డుదయమున రాజమహేంద్రవరమురేవు చేరితిమి. శాస్త్రిగారు వారిబందుగులయింటిలో బసచేసిరి. మాకును అక్కడనే భోజనముపెట్టించిరి. వారు ఆ పట్టణములో ప్రముఖులను చూడబోయి మమ్ములనుగూడ తమతో తీసికొనిపోవుచుండిరి. శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారియింటికి పోయియుందుముగాని వారి నప్పుడు దర్శించినట్లు జ్ఞాపకములేదు. వావిలాల వాసుదేవశాస్త్రిగారప్పుడు గ్రామమున లేరు. సోమంచి భీమశంకరముగారనువారు శ్రీ వీరేశలింగముపంతులుగారికి కుడిభుజముగానుండి స్త్రీపునర్వివాహములు జరుపుటలో మిక్కిలి ధైర్యముతో చేయూత