పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నొకక్రైస్తవవిద్యార్థి అకారణముగ కొట్టినందున నేను ఊలుదొరగారితో చెప్పుకొంటిని. ఆ కుర్రవానిని బిలిచి, చేయిచాపించి అరచేతిలో బెత్తముతో పదిదెబ్బలుకొట్టిరి.

మాచిరాజు సుబ్బారావను నా సహాధ్యాయి గజ్జితో తరగతిలో అందరితో కలసి కూర్చొనుచుండగా నేను ఊలుదొరగారితో చెప్పుటతోడనే ఆయన తరగతిలో చివరను ఇతరవిద్యార్థులతో కలియకుండ నిందుక దూరమున నాతని కూర్చుండచేసెను.

నే నొకప్పుడు జబ్బుపడి, దేహమున నీరుజూపి, బడికి పోవుట కొన్నిదినములు మానవలసివచ్చెను. అప్పు డొక దినమున ఊలుదొరసాని మాయింటికి వచ్చి, నాస్థితి చూచి, నన్ను గవర్నమెంటుఆస్పత్రికి తీసికొనివెళ్ళి, అక్కడి డాక్టరుతో చెప్పి, నాకు మందిప్పించెను. ఆ ఔషధముతో నాకు ఆరోగ్యము కలిగి తిరిగి బడికిపోవుట కవకాశముకలిగినందున ఊలుదొరగారును ఆయనభార్యగారును మిక్కిలి సంతసించిరి. దైవానుగ్రహమున వారికి నాపై నిట్టి అభిమానము గలిగెను.

నేను అయిదవతరగతిలో చదువుచుండగా రివరెండుపాలు అను నొకక్రైస్తవుడు హెడ్‌మాష్టరుగా నుండెను. అగ్రహారీకులగు మాచిరాజువారికుటుంబములో చేరిన కృష్ణమూర్తియు సుబ్బారావు అను ఇరువురుబాలురుగూడ విద్యార్థులుగా నుండిరి. వీరిలో మొదటివాడు మాకు పైతరగతిలోనూ, రెండవవాడు