పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లొకరు తమయొద్దనున్న కారపుబుల్లలుకొంచెము నా కొసంగిరి. వానిలో వాముకాడ నుండుటచే తినుటకు రుచిగ నుండెను. పిమ్మట ఒడలుత్రిప్పుట మాని, సుఖముగానుంటిని. స్టేషనుదగ్గర రిక్షాబండ్లుతప్ప మరేబండ్లును కనుపడలేదు. రిక్షాబం డ్లెక్కగూడదని నాకు నియమ మున్నదిగాన కర్తవ్యతాఅమూడుడనై కొంతవడి చింతించి, తుదకు గతిమాలి రిక్షాపైనెక్కి పోతిని.

ఆ రోజులలో చెన్నపురి శాసనసభ అచట జరుగుచున్నందున దానిని చూచుటకు వెళ్లగా, నచ్చట కేశవపిళ్ళెగారు కనుపడిరి. పిళ్ళెగారు నన్ను జూచి "మీ రిసభలో సభ్యులుగా చేరవలెనని మేము ఎదురుచూచుచున్నా"మని బహూకరణ వాక్యములు పలికిరి. ఒకరోజు జి. యన్. నటేశంగారిని కలుసుకొంటిని. వీరు గాంధిగారు దక్షిణాఫ్రికాలో ప్రభుత్వముతో జరుపుచున్న పోరాటమునుగూర్చి మాటిమాటికి వారిపత్రికలో ప్రకటించుచుండెడివారు. గాంధిగారితో ఉత్తరప్రత్యుత్తరములు జరిపి వారిమైత్రిని సంపాదించుకొనిరి. నాతో ముచ్చటించుచు "మిమ్మునుగూర్చివిశేషముగవినుచున్నాను. మీరుశాసనసభలో ప్రవేశించవలెను. దేశము మీసేవ కెదురుచూచుచున్న"దని ప్రోత్సాహవచనములుపల్కిరి.

ఈ ఉదకమండలమునందు మైసూరు, హైదరాబాదు, విజయనగరముమొదలగు సంస్థానాధీశులకు, జమీందారులకు విశాలములగు భవనములుగలవు. వేసవికాలము పేరుపెట్టి చెన్నపురిగవర్నరుగారును వారి క్రిందియుద్యోగులును సంవత్సరములో దాదాపు సగముకాలము ఇచ్చట వారికొరకు ప్రత్యేకముగ