పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనపడుచుండును. దేవాలయమునకు చేరువగనే యొకకొండ గలదు. ఆకొండలోనుండి ఈనీరు అంతర్వాహినిగా పారుచున్నదని యూహించదగియున్నది. ఈవిషయమును గనిపెట్టిన మహానుభావు లెవరో ఆశివలింగప్రతిష్ఠాపన గావించి ఆశివలింగమునుండి నందిముఖమున ఆపవిత్రజలములు పారింపజేసి తీర్థకుండిక నేర్పరచి ఆస్థలమును గొప్ప తీర్థయాత్రాస్థానము గావించిరి. మనప్పూర్వులిట్టి సహజనిర్మాణములను అద్భుతములగు విచిత్రరూపముల నెత్తించి వానిని తీర్థయాత్రాస్థానములుగ జేసి, దైవభక్తిని ప్రజలలో పురికొల్పుచుండిరి. ఉద్దేశము ఎంత యుక్తమైనను సత్యమును మరుగుపరచు సాధనములచే నెరవేర్ప జూచుట యుక్తముగాదని నాకు తోచుచున్నది.

ఆంధ్రరాష్ట్రనిర్మాణసంబంధమగు ఈప్రచారనిమిత్తమే యొకసారి రాజమహేంద్రవరమున మహాసభ సమావేశమయ్యెను. ఆసభకు న్యాపతి సుబ్బారావుగా రగ్రాసనాధిపతిగా నుండిరి. అచ్చటకు వచ్చినసభ్యులలో పలువురు న్యాయవాదులే. అచ్చట నాప్రసంగము ముగిసినతర్వాత శ్రీధార్వాడ కృష్ణారావుగారును, శ్రీ టంగుటూరి శ్రీరాములుగారును ఆంధ్రరాష్ట్రోద్యమము తమిళులతో కలిసియుండుటవలన కలుగుచున్న లాభములు గమనించలేక సంకుచితదృష్టితో సాగించుచున్నదనియు దీనికి తోడ్పడుట అనుచితమనియు తీవ్రముగ ఖండించిరి. న్యాపతి సుబ్బారావుగారి అభిప్రాయముగూడ ఆధోరణినే, యనుకరించెను. వీరందరు ఆంగ్లేయభాషలోనే ప్రసంగించిరి. అంతట వారిప్రసంగములను సావకాశముగ వినుచున్న శ్రీ చిలక