పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భానుమూర్తిగా రుండనేయుండిరనియు తలంచితిని. శ్రీ కర్వేపండితులు ఒకఉపాధ్యాయురాలి నెట్లును పంపెదమనిరి గాన నాయుద్యమము సాగునను ధైర్యము నా కేర్పడెను.

ఇట్లు శారదానికేతనోద్యమమునడచుచుండ, మాతండ్రిగారి అస్తులను గైకొని నేనును నాతమ్ముడును కాశికి వెళ్ళితిమి. కాశీనుంచి మరలివచ్చునప్పటికి నిడదవోలులో కొన్ని ఆంధ్ర మహాసభలు సమావేశము గానుండెను. గుంటూరు, కృష్ణా, గోదావరిమండలముల కాంగ్రెసుమహాసభయు, సంఘసంస్కరణ మహాసభ, ఆంధ్రఆస్తికమహాసభలును అక్కడ జరుగుటకు నేర్పాటులుజరిగెను. నిడదవోలులో కోవూరుబసివిరెడ్డి యనువారు చదువనువ్రాయను నేర్చియుండకపోయినను గొప్ప వర్తకముచేసి చాలసొమ్ము గడించి యుండిరి. ఆయనకుమారుడు చంద్రారెడ్డి విద్యనేర్చినవాడు. ఆంధ్రదేశాభ్యుదయయోద్యమములం దభిమానముకలవాడు. ఈసభలను ఆయన నిడదవోలుకు ఆహ్వానించి పందిళ్ళు, పాకలు వేయించి, భోజనాదివసతులు ఏర్పరచెను. ఆయాసభలకు సంబంధించిన మహానాయకు లందరును అచ్చట చేరుటచే ఆంధ్రదేశమున ప్రసిద్ధికెక్కిన పురుషులును, స్త్రీలును గూడ నొకరినొకరు గుర్తెరుంగుట కపూర్వవకాశము కలిగెను.

కాంగ్రెసుసభకు వచ్చినవారిలో రాజమహేంద్రవరమువారు గుంటూరు, కృష్ణా, గోదావరులకు మూటికి నొక్కకాంగ్రెసుసంఘము నేర్పాటుచేయనుద్దేశించిరి. అప్పటి కామూడు జిల్లాలకు శాసనసభలో నొక్కరినే సభ్యునిగా నంగీకరించు