పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నప్పుడు సానుభూతి చూపుచు నన్ను కొంత ప్రస్తుతిచేయు చుండెను.

బందరుకోర్టునుండి నేనును శ్రీ ఏకా లక్ష్మీనరసింహము పంతులుగారు మాత్రమే వచ్చితిమి. తెనాలి మునసబుకోర్టు నుండి గోవిందరాజు శ్రీనివాసరావుపంతులుగారును, వంగోలు మునసబుకోర్టునుంచి శ్రీ కొంపల్లి కోటిలింగముపంతులుగారును, శ్రీ గొల్లపూడి రామనాధయ్యగారునువచ్చి, ఈ జిల్లాకోర్టులో న్యాయవాదులుగా చేరిరి. వీరందరిలో నేనే సీనియరును. అనగా జిల్లాకోర్టులో నా కెక్కువ అనభవము కల దన్నమాట. బందరుజిల్లాకోర్టునుంచి ట్రాన్సుఫరుకాబడిన అప్పీళ్లు, అసలువ్యాజ్యములలో హెచ్చుభాగము నేను వకాల్తు పొందిన వగుటచే కోర్టులో హెచ్చుపని నాచేతులలోనే యుండెను. నా నేర్పు కక్షిదారులకు బోధపడుట కెక్కువ అవకాశము కల్గెను. ఆ కేసులు పూర్తిగ పరిష్కారమైనపిదపగూడ నాకుపని పూర్తిగనే లభించుచుండెను. కొలదిసంవత్సరములలో వ్యాజ్యములయు అపీళ్లయు సంఖ్య హెచ్చినకొలది తక్కిన న్యాయవాదులకుగూడ పని హెచ్చెను. అందులో గోవిందరాజు శ్రీనివాసరావుగారి వాదనాసామర్ధ్యము హెచ్చుగ ప్రకటితమగుచుండెను. కొంపల్లి కోటిలింగముగారును ఆయనతో కొంచె మెచ్చుసరి దీటుగ నేర్పరితనము వెల్లడించుచుండెను. శ్రీ గొల్లపూడి రామనాధయ్యగారు నానాట ఉపాయముగ కేసులు రాబట్టుకొనగల్గెను. టౌటులను వినియోగించుకొని వారిద్వారా కేసులు సంపాదించుకొను దురాచారము నానాట