పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జామీను ఆర్డరువేయుట మొదలగు అక్రమచర్య లన్నియు మొడటినుండి తుదివరకు జరిగిన గ్రంథ మంతయు తెలియపరచెను.

ఆసామీ తన పశువులను బందెలదొడ్డికి తోలనివ్వకుండ తీసికొనివచ్చుట చోరీగా నిర్ణయించినట్లు చెప్పుటతోడనే "ఈ మాజస్ట్రేటు ఎవరు ? ఎంతటిఘను"?డని న్యాయమూర్తులు ప్రశ్నించిరి. కృష్ణస్వామయ్యరు చెప్పిన దంతయు సావకాశముగ విన్నపిమ్మట, రివిజన్‌పిటీషను కేసులలో సాక్ష్యము చదువుట ఆచారము గాకపోయినను ఈ వ్యవహారసందర్భమునుబట్టి సాక్షి వాగ్మూలములు చదివెదముగాక యని ఆ చోరీకేసులోని వాగ్మూలములను చదువగోరి, కృష్ణస్వామి అయ్యరు వాటిని చదివి వినిపించిరి. పిమ్మట మా పిటీషనుకు సంబంధించిన అఫిడవిట్లుగూడ చదివి వినిపించిరి. ఇవి అన్నియు వినిపించినపిమ్మట గవర్ణమెంటు ప్రాసిక్యూటరు పవల్ గారిని 'మీ రేమి చెప్పెద' రని ప్రశ్నించిరి. మాజస్ట్రేటునుగూర్చి దూషణవాక్యములు పిటిషన్‌లో వ్రాసి, దాఖలుచేయుటచే అధికారిచర్యకు అడ్డము అనునేరమునకు ప్లీడర్లు పాత్రులేయని వాదించెను. "మాజస్ట్రేటు ఇంటిలో నున్నప్పు డిచ్చినా, ఆయనకోర్టులో అధికారము చలాయించుచున్నట్లేనా" యని ప్రశ్నించిరి. 'ఎక్కడైనా మేజస్ట్రేటు మాజస్ట్రేటే' యని ఆయన మారుపల్కెను. వంట యింట్లో నున్నను మాజస్ట్రేటేనాయని హేళనగ మాట్లాడిరి. అంతట పవల్‌గారు మరేమియు మాట్లాడక కూర్చుండెను.

న్యాయమూర్తులు మా పిటీషన్‌నుగూర్చి వ్రాయుచు "ప్లీడర్లు అధికారికి పెట్టిన పిటీషనులో ఆయననుగూర్చి అట్లు