పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాయరే ముద్దాయి ఆయెను

పిమ్మటిదినములలో ముఖ్యాంశ మొక్కటి వివరింపదగియున్నది. బందరు సమీపమున అవనిగడ్డలో నొక డిప్యూటీ తహశ్శీలుదారుడు మాజస్ట్రేటుగా సహితము వ్యవహరించు చుండెను. ఇతడు చాల లంచగొండియనియు, ప్రజలను పీడించు చున్నాడనియు చెప్పుకొనుచుండిరి. తనపశువులు మరియొకరి పొలములో బడి పైరు నష్టపరచిన వనుకారణమున వాని నారైతు బందెలదొడ్డికి తోలుకొనిపోవుచుండగా నడ్డగించి ఒక రైతు తనయింటికి తోలుకొనివెళ్ళి కట్టివేసుకొనెను. అవనిగడ్డ మాజస్ట్రేటుదగ్గర ఛార్జిదాఖలు చేయబడినది. ఇది అవకాశముచేసుకొని పశువులఖామందైనరహితును జయిలులోబెట్టి నూరురూపాయల లంచము తీసికొని విడుదలచేసి, పిమ్మట కేసు విచారణచేసి దొంగనేరముక్రింద రు 10/- లు జరిమానా విధించెను. ఇట్టివియే అనేకులవలన లంచములు పుచ్చుకొనినట్లు జిల్లాకలెక్టరుకు మహజరులు వచ్చినందున డిపార్టుమెంటల్ విచారణ చేయుటకు కలెక్టరు నిర్ణయించి, అందుకు తనకు సహాయోద్యోగియగు బోసు అనువారిని నియమించెను. ఆయన సాకల్యముగా విచారించి,మాజిస్ట్రేటు లంచములు పుచ్చుకొనినట్లు రుజువైనదని జిల్లాకలెక్టరుకు నివేదిక నంపెను. ఆకాలమున శ్రీ పండిత నాగేశ్వరరావుగారు హెడ్‌క్వార్టర్సు డిప్యూటీమాజిస్ట్రేటుగా నుండి, జిల్లాకలెక్టరుకు మిక్కిలి యిష్టులుగా నుండిరి. బోసుగారి నివేదికను కలెక్టరు నాగేశ్వరరావుగారి కిచ్చి, దానిని చదివి అభిప్రాయమును తెలుపుమనెను. నాగేశ్వరరావుగా తా నివేది