పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థానమునకు బోయినందుకు కర్జనుప్రభువు కోపించి మహారాజు మీద కొంత చర్యజరిపి,వారిపై నేదియో అపరాధము విధించినట్లు తెలియవచ్చినది.

ఈ మహోత్సవమున భారతజాతిపతనము నైతికముగ శోచనీయమైనను ఆ దృశ్యము అపూర్వము ననన్యమగు వైభవముతో విలసిల్లినదని చెప్పవచ్చును. ఈ ఊరేగింపు జరిగిన మరునాడు అరువదివేలసేన ఒక్కచో ప్రదర్శింపబడెనుగాని దానిని మేము చాలదూరమునుండి మాత్రమే చూడగల్గితిమి.

పురాతనమగు ఈమహానగరమున లాల్‌ఖిల్లా కుతుబ్ మినారు మున్నగు అపురూపములగు దృశ్యములు తిలకించి పిమ్మట ఆగ్రాకు చేరి, అచట నొక హిందూగృహస్థు ఇంట బసచేసితిని. టాజమహల్ అక్కడికి సమీపముననే యుండుటచేత మిక్కిలి ఆతురతతో ఆభవనముచెంతకు బోయి కొంచెముసేపు దానిని ఆశ్చర్యముతో పరికించి, పిమ్మట సావధానముగ చూడవచ్చునని మరల బసకు వచ్చితిని. దుకాణమునుండి పాలును, పండ్లు తెచ్చుకొని భుజించి కొంత విశ్రమించి మరల టాజమహల్‌ను దర్శించితిని. ఈదివ్యభవనమునకు బట్టిన పాలఱాయి యంతయు జయపూరునుండియు, ఎఱ్ఱయిసుకరాయి ఫట్టిపూరుసిక్రీనుండియు తెప్పించిరట. దాని నిర్మాణకౌశలముగాని శిల్పవైచిత్ర్యమునుగాని వర్ణింపశక్యముగాదు. ఇది చంద్ర శిలామయమైన అపురూపచిత్రనిలయము.దీనిని దర్శించునపుడు కలలో జూచుచున్న మయసభ యని తోచును. 'పాలరాతితో