పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నప్పుడు హనుమంతరావును, లక్ష్మీనరసింహమును ఇతర కోర్టులలోనుండిరి. అప్పటినుండి శ్రీదేవమ్మగారి పనులతోను, తాయి సుబ్బారావునాయుడు పనులతోను సంబంధము విడిపోయెను.

నేను బందరుకు మొదట నొంటరిగనే వెళ్ళితిని. హనుమంతరావు తన తలిదండ్రులను, చెల్లెండ్రను భార్యనుగూడ తీసికొనివచ్చి గొడుగుపేటలో నొకయింట కాపురముండెను.

నే నొంటరిగనే యుండి లక్ష్మీనరసింహముగారి ఇంటిలో భోజనముచేయుచుంటిని, తర్వాత కొన్నాళ్ళకు మా ఆఫీసు పెట్టిన ఇంటిలో నొక వంటయామె వంటచేసి పెట్టుచుండెను. నాతమ్ముడు సూర్యనారాయణ చెన్నపట్టణములోనే చదువుకొనుచుండెను. నేను బి. యల్. చదువుచుండగనే 12 - 11 - 1892 న నాకు ప్రధమసంతానము, ఆడశిశువు కలిగెను. బందరుచేరిన పిమ్మట నాభార్యపుట్టినింటనే మరల కుమార్తెను గనెను. ఇట్లుండగా నాతమ్మునికి పిల్లనిచ్చెదమని కృష్ణాజిల్లా తిరువూరు తాలూకా కనుమూరి గ్రామవాస్తవ్యులు జమీందారులు గాడిచర్ల కృష్ణమూర్తిగారు నాకు వర్తమానమంపిరి. మాతండ్రిగారిని అడగవలసినదిగా కబురంపితిని. కొన్ని రోజులకు మనుము నిశ్చయమయ్యెను. నేను బందరులో నుండగనే నాభార్యను పిల్లలను గుంటూరునకు తీసికొనివచ్చిరి. అంతకుముం దొకసారి నాచిన్నతమ్ముని ఉపనయనమునకు ముందు పెద్దపిల్లను కడుపుతోనుండగా నాభార్యను తీసుకొనివచ్చిరి. మరల కాన్పు నిమిత్తము కొలదిదినములలోనే లింగమగుంటకు వెళ్ళవలసి