పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తప్పదు. నిర్దోషిని రక్షించితి మనుభావము నాకు లేదు. పిమ్మట చిన్న క్రిమినల్‌కేసులో ముద్దాయితరపున పనిచేయుట తటస్థించినది. చాలావరకు జయప్రదముగానే ఆ కేసు నడిచినది. కాని యోచనచేసినకొలది మనస్సునకు ధర్మసందేహములు కలుగుచు, కొంతబాధ కలుగుచు వచ్చినది. సాక్షులు చెప్పుమాటలు కేసు గెలుచుటకు తగినట్లుండుటకు కొంత ప్రయత్నము చేయవలసి వచ్చినది. కేవలము సాక్షులకు పాఠము నేర్పించకపోయినను, సాక్ష్యమట్లుండిననేగాని కేసు మనకు అనుకూలము గానేరదని సూచనలు చేయవలసివచ్చెను. ఇట్లు కొంతకాలము మన:క్లేశమును పొందుచుండగనే, మామిత్రుడు లక్ష్మీనరసింహంగారు మాలోనుంచి విడిపోయి తాను వేరుగా వ్యవహరించుకొనెదనని చెప్పుటచే మే మందుకు సమ్మతించితిమి. నేను, హనుమంతరావును మాత్రమే కలసిపనిచేయుచుంటిమి.

లక్ష్మీనరసింహముతో కలసిపనిచేయుచున్న కాలములోనే శ్రీదేవమ్మతండ్రి తాయి సుబ్బారావునాయుడుగారిపై దావా దాఖలుచేయుటకు ఎవరో పూనుకొని, ముందుగనే ఆస్తికి ఫైలు జప్తు పెట్టుదురని తెలిసి, ఆయన, నాకు, హనుమంతురావుకు వకాల్తాలిచ్చి అట్టి పిటీషన్ న్యాయవాది ఎవరైన పెట్టినపుడు ఫైలుజప్తుకు ఉత్తరువు చేయ నవసరములేదనియు తగినఆస్తి జామీ నిచ్చుటకు సిద్ధముగా నున్నాడనియు, ఆస్తి అన్యాక్రాంతముచేయు నుద్దేశ్యము లేదనియు అఫిడివిట్ దాఖలుచేయ వలసినదని నన్ను కోరియుండిరి. నేను ఆప్రకారమే కోర్టులో కనిపెట్టియేయుంటినిగాని వావిలాల శివావధానులుగారు న్యాయ