పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యింటిలోనే సాయంకాలమున పురాణముచదివి వినుపించుచుండెడివారని వినియున్నాను. వీరిపత్ని గూడా పూనాలో స్త్రీవిద్యను గురించి శ్రద్ధగా పనిచేసియుండెను.

నేను రెండుసార్లు బి. యల్. తప్పిపోయి, మూడవసారి పరీక్షనిమిత్తము చదువుచున్నకాలములో ఏదయినా ఉద్యోగమునిప్పించుటకు, రిజిస్ట్రార్ జనరల్‌గారికి దరఖాస్తుపంపి, అందుతో నాకు డాక్టరు మిల్లరుగా రిచ్చిన యోగ్యతాపత్రమునుగూడ పంపితిని. దానిఫలితము తేలకముందే బి. యల్. పరీక్షలో గెలిచితిని. ఆనాటి సాయంకాలమే బాపట్ల ప్రొబేషనరీ సబ్‌రిజిస్ట్రారుగా నియమించి, బందురులోనున్న హెడ్‌రిజిస్ట్రారుగారి యొద్దకు హాజరుకావలెనని, రిజిస్ట్రారుజనరల్‌గారి కార్యాలయమునుండి ఉత్తరువువచ్చెను. హెడ్‌రిజిస్ట్రారుగారు గుంటూరులో సబ్‌రిజిస్ట్రార్‌గా నున్నప్పుడు నన్ను ఎరిగినవారగుటచే "నీవిప్పుడు బి. యల్. లో కృతార్థుడవైనావు గనుక ఈ ఉద్యోగమునకు రావని తలంచుచున్నా"నని యుత్తరముగూడ వ్రాసినారు. నేను ఆఉద్యోగములో ప్రవేశించుటలేదని ప్రత్యుత్తరము వ్రాసి పంపినాను.

చాలకాలమునుండి న్యాయవాదిగా పనిచేయవలెనని నామిత్రుడు హనుమంతురావునూ నేనును కోరుచుంటిమి. కావున మే మిరువురమును బందరుజిల్లాకోర్టులో న్యాయవాదులుగా ప్రవేశింప నిశ్చయించుకొంటిమి. మాకు ఉభయులకును మిత్రుడగు కలపటపు లక్ష్మీనరసింహము సెకండరీగ్రేడు ప్లీడరుగా