పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదినములలో మేము క్రైస్తవకళాశాలలో చదువుచుండినప్పుడు, దివాన్ బహద్దూర్ రఘునాధరావుగారు గొప్ప సర్కారు ఉద్యోగములుచేసి ఇందూరు సంస్థానములో దివానుగ కొంతకాలము పనిచేసి, న్యాయవర్తనచేతను, దైవభక్తిమొదలగు నున్నతగుణములచేతను పేరుపొందినవారుగా నుండిరి. ఇంచుక పొట్టిగా నున్నను పచ్చనిదేహకాంతి గలిగి, ధోవతికట్టుకొని పసుపుపచ్చ పట్టులాంగుకోటు తొడిగి, దేశస్థులు చుట్టుకొను తలపాగా చుట్టుకొని మనోజ్ఞమగు స్వరూపముతో దైవభక్తిని గూర్చియు, న్యాయవర్తనమునుగూర్చియు, అండర్సన్‌హాలులో ఉపన్యసించుచుండిరి. వీరియందు మా కెంతయో గౌరవభావము సమకూడెను. వారు ఉపన్యసించుసమయములలో చదివిన

         ఓన్నమ: పరన్మై పురుషాయ భూయసే సదుద్భవ
         స్థాన నిరోధలీలయా గృహీతశక్తి త్రితయాయ
         దేహినాం అంతర్భవానుపలక్ష్యవర్త్మనే

యీ శ్లోకము నేను మాటిమాటికి నుచ్చరించుచు, ఇప్పటికిని ప్రతిదినము నా సంధ్యావందనసమయమునందు పఠించుచుందును. వీరికి వీణావాద్యము ప్రియమనియు స్వయముగనే వీణ వాయించుకొని పాడుచు, ఆనందమునొందుచుందురనియు వింటిని. ఇట్టి సచ్చారిత్రులు చిరస్మరణీయులు.

చెన్నపట్టణములో దూరపుబేటలకు బోవలయునన్న సామాన్యజనులకు దేశవాళిపొట్టిగుఱ్ఱములు గట్టిన పెట్టెబండ్లే ఆధారము. ఈబండ్లు భోషాణములవలె నుండి, యిరుకుగా నుండెడివి. నలుగురిని ఒక్కసారి ఎక్కించుకొని పోవుచు, దూర