పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవడాబాయి

85

లలో నామెదీనియందు విశేషప్రజ్ఞగలదియయ్యెను. ఆమెకు నేర్పవలసిన సమయ మెపుడు వచ్చునాయని నిరీక్షింపుచుండెడిదానను. ఆవిషయమామెకు నేర్పుటనాకు వినోదకరముగా నుండుచుండెను.'

ఆమెకు గానము, జలతారుపూలు, తీగెలు, కుట్టుపని నేర్పుటకు నామె చెల్లెలిని నియమించిరి. కాని యామెశరీర మస్వస్థముగా నుండినందున గానవిద్య నేర్చుకొనుట కవకాశము చిక్కదయ్యెను. జలతారుపూవులు వగయరాలపనియం దామెకుఁ గల నిపుణత్వ మామెచేఁ గుట్టఁబడిన జలతారుపని వలననే తెలియుచున్నది.

తన సుస్వాభావమువలన నామె తన సహాధ్యాయినుల కెట్లు ప్రియురాలాయెనో, యదేప్రకారముగా నుపాధ్యాయినులకుఁ గూడ ప్రియతమురాలయ్యెను. ఆమెయం దద్వితీయమగు వినయముగలదు. ఆగుణమే సర్వసద్గుణములలో శ్రేష్ఠమైనదని నాయభిప్రాయము. ఆమెయందు నీ యలౌకికగుణమును లుండినందుననే యామెను ఉపాధ్యాయిను లెప్పుడును పొగడుచుండిరి. పాఠశాలఁ గనుఁగొనవచ్చిన సద్గృహస్థులనేకు లామెను ప్రశంసించెడివారు. ప్రతిసంవత్సరమును పరీక్షలయందు దేరి బహుమతుల నందుచుండెను. ఇన్ని గలిగియు తుదవఱ కామెయం దహంకార మన్నమాటయే కానిపించ లేదు. ఎంతవిద్య నేర్చెనో యంతవినయము మధికమగుచుండెను. ఆహా! విద్యాదదాతి వినయమ్ అను లక్షణమున కింతకంటె మఱియేమి లక్ష్యము కావలెను?