పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవడాబాయి

81

పుదుమని బెదరించిరి. దు:ఖసముద్రమునందు మునిఁగియు, జంకక విద్యయను నొకయూఁతకోల నాధారము చేసికొని, యాసముద్రమునుండి వెల్వడఁ బ్రయత్నింపుచున్న ఆవడాబాయిపై దుష్టుల కుశబ్దములను శిలావర్షము కురియఁగా నామె మనస్థ్సితి యెటుండెనో చదువరులె యూహించుకొనఁగలరు. ఇట్లామె యెన్నికష్టములు వచ్చినను విద్యమాత్రము వదలక తననురక్షింప న్యాయస్వరూపుఁడైన పరమేశ్వరుఁడే గలఁడని ధైర్యముతో నుండెను. ఇట్టినిరుపమానధైర్య మెంతయుఁ బ్రశంసనీయముగదా?

1887 వ సంవత్సర మావడాబాయిని మిగుల ప్రేమించునట్టి యక్క చింగూబాయి క్షయరోగమువలన మృతిఁజెందెను. ఈమె తనముద్దుచెల్లెలికి ప్రాప్తించిన వైధవ్యదు:ఖమునకై మిగుల చింతించుచు నెల్లపుడు ఆవడాబాయికి దు:ఖోపశమన వచనములఁ జెప్పుచు విద్యయందు పరోపకారమునందును విశేషాసక్తి కలుగఁజేసెను. ఇట్లుమనసుగలిసి ప్రేమించునట్టి సహోదరియొక్క మరణమువలన ఆవడాబాయికి నత్యంతదు:ఖముకలిగెను. ఆదు:ఖమువలననే కొన్నిరోజులు విద్యాభ్యాసము జరగక తుదకొక విధముగా మనస్సమాధానముచేసికొని యేది యెట్లయిననుతలఁచిన సత్కార్యము విడువగూడదని యామెవిద్య నధిక ప్రయత్నముతో నభ్యసింపసాగెను. ఇట్లామె దుస్సహ దు:ఖములలో మునిఁగియుండియు నసమానధైర్యముతో విద్య నభ్యసింపుచుండఁగా 1887 వ సంవత్సరాంతమున నామెకుఁ గొంచెము దేహమస్వస్థముగా నుండసాగెను. అందువలన నాయెండకాల మామె మహాబలేశ్వరమను ఆరోగ్యప్రదమైన